బెంగాల్‌లోని ముర్షీదాబాద్ వరుసగా నాలుగు రోజుల నుంచీ ఘర్షణలతో అట్టుడికిపోతోందని విశ్వహిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ ఆందోళన వ్యక్తం చేసారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దేశమంతా మతఘర్షణలు రగిలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అనుమానిస్తున్నారు. వక్ఫ్ సవరణల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందు సుమారు కోటిమంది భారతీయులు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేసారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ 25 గంటల కంటె ఎక్కువ సమయం చరిత్రాత్మకమైన చర్చలు జరిగాయి. ఆ తర్వాతే బిల్లు పాస్ అయింది. అయినప్పటికీ సెక్యులర్లు, జిహాదీల జోడీ ఈ దేశాన్ని అల్లర్ల మంటల్లో తగులబెట్టేయడానికి కుట్రలు పన్నుతోందని, అలాంటి కుట్రలకు ఈ దేశ ప్రజలు దూరంగా ఉండాలనీ సురేంద్ర జైన్ హెచ్చరించారు.
వక్ఫ్ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 18కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. రాజ్యాంగాన్ని గౌరవించేవారు సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూడాలి. కానీ ఈ పిటిషన్లు దాఖలు చేసిన పెద్దమనుషులకు దేశపు రాజ్యాంగం మీదా, న్యాయవ్యవస్థ మీదా ఎలాంటి గౌరవం లేనట్లుంది అని సురేంద్ర జైన్ వ్యాఖ్యానించారు.
వక్ఫ్ బోర్డు పేరు మీద నడుస్తున్న ల్యాండ్ మాఫియా, ముస్లిం ఓట్ల మీద గుత్తాధికారం తమదేనని భావించే క్యులర్ మాఫియాలు తమ స్వార్థం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాయి. వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకుని ఆక్రమించుకున్న భూములను కోల్పోతామని ల్యాండ్ మాఫియా కంగారు పడుతోంది, ముస్లిం ఓట్ల మీద తమ గుత్తాధిపత్యం పోతుందని సెక్యులర్ మాఫియా బాధపడుతోంది అని సురేంద్రజైన్ స్పష్టం చేసారు.
ల్యాండ్ మాఫియా, సెక్యులర్ మాఫియాల అపవిత్ర పొత్తు కలిగించే బీభత్సం ఎలా ఉంటుందో 2013లో గురుగ్రామ్‌లో కనిపించిందని సురేంద్ర జైన్ గుర్తు చేసారు. 2013లో గురుగ్రామ్‌లోని పాలం విహార్‌లో ఒక పార్కును వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారు. నమాజు పేరిట అక్కడ పెద్దసంఖ్యలో ముస్లిములు జమ అవుతుండేవారు. అప్పట్లో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. వారి ప్రభుత్వం ముస్లిముల ప్రతీ చర్యకూ తలూపుతూ ఉండేది. ఏ స్థలాన్ని అయినా చూపించి అది వక్ఫ్‌ది అంటే చాలు, ఏ ఆధారం లేకపోయినా వారికి అప్పగించేసేది. ఢిల్లీలో కోట్లాది రూపాయల విలువైన 123 ప్రభుత్వ ఆస్తుల మీద వక్ఫ్ కన్ను పడింది. అవన్నీ తమవేనంటూ వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుంది. అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, వారిని ఎలాంటి ఆధారాలూ అడగకుండా ఆ ప్రభుత్వ ఆస్తులన్నింటినీ వక్ఫ్ బోర్డుకు పువ్వుల్లో పెట్టి మరీ ఉచితంగా అప్పగించేసింది. అది సరిగ్గా 2014 సార్వత్రిక ఎన్నికల ప్రకటన జరిగిన రోజునే జరగడం యాదృచ్ఛికం ఎంతమాత్రం కాదు.
అయితే జాగృతంగా ఉన్న హిందూ సమాజం, అప్రమత్తంగా ఉన్న న్యాయ వ్యవస్థ, హిందూ సంస్థల అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా ఆ రెండు కుట్రలూ విఫలమయ్యాయి. కానీ వక్ఫ్ చట్టంలో 2013లో చేసిన సవరణల ఆధారంగా దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఆస్తులు తమవేనంటూ వక్ఫ్ బోర్డుల క్లెయిమ్‌లు వెల్లువెత్తాయి. ఒక దశలో దేశం మొత్తాన్నీ వక్ఫ్ ఆస్తిగా ప్రకటించి కొంతమంది మౌల్వీలు ఈ దేశాన్ని తమ ప్రైవేటు రాజ్యంగా మార్చేసుకుంటారేమో అన్నంత దుస్థితి దాపురించింది అని సురేంద్ర జైన్ తలచుకున్నారు.
వక్ఫ్ సవరణల బిల్లు పాస్ అయిన తర్వాత కూడా దాన్ని వ్యతిరేకించడానికి హక్కు అయితే ఉంటుంది, కానీ ఆ పేరిట దేశంలో మతఘర్షణలు రేపడానికి ఎవరికీ అధికారం లేదు. సెక్యులర్లు, జిహాదీల అపవిత్ర పొత్తు కారణంగా భారతదేశ విభజన జరిగింది. వారి అపవిత్ర పొత్తు కారణంగానే షాబానో కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను సైతం ధిక్కరించి ప్రత్యేక చట్టానికి రూపకల్పన జరిగింది. కానీ ఇప్పుడు దేశాన్ని ముక్కలు చేయడం కుదరదు. ముస్లిం సమాజంలోని పెద్ద వర్గం ఒవైసీ వంటి నాయకుల నిజస్వరూపాన్ని అర్ధం చేసుకుంది. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి సెక్యులర్ మాఫియా నాయకుల అసలు తత్వం బాగా తెలిసిపోయింది. వక్ఫ్ సవరణల చట్టం నిజానిజాలు, ఈ నాయకుల నిజ స్వరూపాలూ దేశ ప్రజలకు పూర్తిగా అర్ధమయ్యాయి అని సురేంద్ర జైన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఇప్పుడు ఈ సెక్యులర్-జిహాదీ జోడీ దేశంలో అల్లర్లు రేపాలని ప్రయత్నిస్తోంది. దేశ ప్రజలు అలాంటి ఘర్షణలకు దూరంగా ఉండి, తమను తాము రక్షించుకోవడంతో పాటు దేశాన్ని కూడా రక్షించాలి అని విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ దేశప్రజలకు పిలుపునిచ్చారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత