వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై శ్రీ సత్యసాయి జిల్లాలో కేసు నమోదైంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారంనాడు శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లెలో పర్యటించారు. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి హెలికాఫ్టర్ దిగకముందే వేలాది మంది కార్యకర్తలు అక్కడకు చేరుకుని పోలీసులపై దాడికి దిగారు. హెలికాఫ్టర్‌పై కొందరు పిడిగుద్దులు కురిపించారు. పోలీసుల వైఫల్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారంటూ పోలీసులు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఓ హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగిరి పోలీసులు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని చిత్రీకరించాలనే ఉద్దేశంతోనే వేలాది మందిని హెలికాప్టర్ వద్దకు దూసుకెళ్లేలా చేశారంటూ ఎమ్మెల్యేపై అభియోగాలు నమోదు చేశారు. పోలీసులపై రాళ్లదాడి చేయడం, హెలికాఫ్టర్‌పై దాడి చేయడం వంటి కారణాలతో తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత