తీహార్ జైల్లో తహవ్వుర్ రాణా..
ముంబై 26/11 మారణహోమానికి సంబంధించిన సూత్రధారి తహవ్వుర్ రాణాను ఎట్టకేలకు భారత్ కు తీసుకొచ్చారు. తహవ్వుర్ రాణా పాకిస్తాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి కావడంతో పాటు పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడనే ఆరోపణలు అతడిపై ఉన్నాయి. 2009 లో అమెరికాలో అరెస్ట్ అయి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అప్పగింత ప్రక్రియలో భాగంగా అమెరికా నుంచి ప్రస్తుతం భారత్‌కు తీసుకువచ్చారు. అతడిని అధికారికంగా అరెస్టు చేసి అటు నుంచి తిహార్ జైలుకు ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తరలిస్తారు.
తహవ్వుర్ రాణా పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడియుడు తొలుత పాకిస్తాన్ సైన్యంలో వైద్యునిగా పనిచేశాడు. ఆ తర్వాత అమెరికాలోని చికాగోలో స్థిరపడ్డాడు. ఉగ్రవాది దావూద్ సయ్యద్ గిలానీ తో తహవ్వుర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
అమెరికాలోని చికాగోలో రాణాను 2009లో ఎఫ్‌బీఐ అరెస్టు చేసింది. ముంబై దాడులకు సంబంధించిన ఆరోపణలతో పాటు, డెన్మార్క్‌లోని ఒక వార్తాపత్రికపై దాడికి సంబంధించిన ఆరోపణలున్నాయి.
2011లో అమెరికన్ కోర్టు రాణాను లష్కర్-ఏ-తోయిబాకు సహాయం చేసినందుకు దోషిగా తేల్చింది. కానీ ముంబై దాడులకు సంబంధించిన ఆరోపణల నుంచి విముక్తి కల్పించింది. అయితే హెడ్లీ ఇచ్చిన సాక్ష్యం ఆధారంగా భారత్ , రాణాను ఈ దాడుల్లో భాగస్వామిగా గుర్తించింది. 2025 ఏప్రిల్‌లో రాణాను భారతదేశానికి అప్పగించేందుకు అమెరికా సుప్రీం కోర్టు అంగీకరించింది. దీంతో భారత్ కు తీసుకువచ్చారు.
ఈ కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నరేందర్ మాన్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు సంవత్సరాల కాలానికి లేకపోతే ట్రయల్ పూర్తయ్యేవరకు దిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానాలు, అప్పిలేట్ కోర్టుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తరఫున వాదనలు వినిపించనున్నారు.
2008 నవంబర్ 26న 10 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబయికి చేరుకుని, సీఎస్ఎంటీ, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. నవంబర్ 29 వరకు మారణహోమం కొనసాగింది. ఈ ఘటనల్లో 18 మంది భద్రత సిబ్బందితో పాటు 166 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత