ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతి గురించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐ-టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై తెలుగుదేశం పార్టీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నుంచి కిరణ్‌ను సస్పెండ్ చేసింది. మహిళలు ఏ పార్టీకి చెందిన వారైనా సరే, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేసారు. దాని ఆధారంగా గుంటూరు పోలీసులు చేబ్రోలు కిరణ్ మీద కేసు నమోదు చేసారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత