ఇస్లాం, వక్ఫ్ గురించి మాట్లాడుతున్నారా…. మీ చుట్టూ ఎవరున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు మాట్లాడే మాటలు ఎవరు వింటున్నారో గమనించుకుంటూ ఉండండి. మీరు మాట్లాడేది చట్టపరంగా కరెక్టే అయి ఉండవచ్చు. కానీ మీకు తెలియకుండానే ఆ మాటలు వింటున్న వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు మీ మీద దాడి చేసే ప్రమాదముంది. తమ అతివాద భావజాలాన్ని నిలదీస్తున్నారనే భ్రమలతో మిమ్మల్ని చితగ్గొట్టే అవకాశముంది.
ఇదేమీ అతిగా ఊహిస్తున్న కల్పన కాదు. ఉత్తరప్రదేశ్‌లో నిజంగా జరిగిన సంఘటనే. అందులోనూ, దాడికి పాల్పడిన వ్యక్తి ఒక క్యాబ్ డ్రైవర్ అయితే, బాధితుడు రిటైర్డ్ ఆర్మీ కల్నల్ కావడం గమనార్హం.
భారత సైన్యంలో కల్నల్‌గా పనిచేసి రిటైర్ అయిన సూర్యప్రతాప్ సింగ్ అనే వ్యక్తి ప్రస్తుతం కాన్పూర్‌లో జిల్లా సైనిక పునరావాస సంక్షేమ బోర్డులో పనిచేస్తున్నారు. ఏప్రిల్ 5 శనివారం నాడు ఆయన కాన్పూర్ నుంచి లఖ్‌నవూ వెళ్ళవలసి వచ్చింది. ఆ ప్రయాణం కోసం ఒక క్యాబ్ బుక్ చేసుకున్నారు. ప్రయాణంలో ఉండగా ఆయనకు ఒక స్నేహితుడు కాల్ చేసాడు. వారిద్దరూ పలు విషయాలు మాట్లాడుకుంటూ ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్‌గా ఉన్న వక్ఫ్ బిల్లు అంశం గురించి మాట్లాడుకుంటున్నారు.
రిటైర్డ్ కల్నల్ సూర్యప్రతాప్ సింగ్‌కు తెలియని విషయం ఏంటంటే ఆ క్యాబ్ డ్రైవర్ పేరు వాసిమ్. సూర్యప్రతాప్ సింగ్, తన స్నేహితుడితో ఫోన్లో మాట్లాడుతున్న సంభాషణను అతను విన్నాడు. అతను మొదట్లో మౌనంగానే ఉన్నాడు. దారి మధ్యలో ఉండగా అతను తన స్నేహితులు కొంతమందికి సమాచారం అందించి, వారిని ఒక నిర్దిష్ట ప్రదేశం దగ్గరకు చేరుకోవాలని పిలిచాడు. ఆ ప్రదేశానికి క్యాబ్ చేరుకునేసరికి ఆ గుంపంతా అక్కడ సిద్ధంగా ఉన్నారు. వారు క్యాబ్ డ్రైవర్ వాసిమ్‌తో కలిసి సూర్యప్రతాప్ సింగ్‌ను క్యాబ్‌లోనుంచి బైటకు లాగారు. ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో ఆయనకు గాయాలయ్యాయి. తర్వాత సూర్యప్రతాప్ సింగ్ స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసారు. వాసిమ్ అనే క్యాబ్ డ్రైవర్, పలువురు గుర్తు తెలియని వ్యక్తులూ కలిసి తనపై దాడి చేసారన్న సంగతిని ఆయన పోలీసులకు వెల్లడించారు. దాంతో ప్రాథమిక దర్యాప్తు నివేదిక నమోదయింది. కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తర్వాత సూర్యప్రతాప్ సింగ్ జరిగిన సంఘటన గురించి వివరిస్తూ ఒక వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసారు. ఆ వీడియోలో ఆయన ఒంటిమీది గాయాలు కనిపిస్తున్నాయి. ఆయన సరిగ్గా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. తన స్నేహితుడితో మాట్లాడుతున్న సందర్భంలో యధాలాపంగా వక్ఫ్ బోర్డు వివాదం గురించి చర్చ వచ్చిందనీ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న ఆ విషయం గురించి కొన్ని మాటలు మాట్లాడుకున్నామనీ ఆయన వివరించారు. ఆ మాటలను విన్న క్యాబ్ డ్రైవర్ వాసిమ్, తన సహచరులతో కలిసి తనను చితకబాదారని తెలియజేసారు.
ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆన్లైన్లో దానిమీద పలువురు వ్యాఖ్యలు చేసారు. చాలామంది రిటైర్డ్ కల్నల్ మీద జరిగిన దాడిని ఖండించారు. కొంతమంది మాత్రం సూర్యప్రతాప్ సింగ్ మాట, నడక చూస్తుంటే ఆయన తాగేసి ఉన్నట్లున్నారని వ్యాఖ్యలు చేసారు. అంతేతప్ప, జరిగిన దాడి కారణంగా ఆయన సరిగ్గా మాట్లాడలేక పోతున్నారని, సరిగ్గా నడవలేని స్థితికి చేరుకున్నారనీ ఒప్పుకోకుండా వితండవాదాలు కొనసాగించారు.
ప్రత్యక్ష సాక్షుల కథనాలు కానీ, పోలీసుల ప్రాథమిక ప్రకటనలు కానీ విశ్రాంత కల్నల్ మద్యం ప్రభావంలో ఉన్నారన్న సంగతిని ధ్రువీకరించడం లేదు, అలా అని ఖండించడమూ లేదు. అయితే సంఘటన జరిగిన తర్వాత ఆయన పోలీసుల వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసిన సమయంలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించలేదన్న సంగతిని పోలీసులు ఒప్పుకున్నారు. ఏది ఏమైనా, స్వయంగా బాధితుడే తనను కొందరు వ్యక్తులు చితకబాదారనీ, గాయపరిచి నడిరోడ్డు మీద వదిలేసారనీ చెబుతున్నారు. కొంతమంది నెటిజన్లు ఆ సంగతిని కనీసం పట్టించుకోలేదు. ఆయనే మద్యం మత్తులో గాయపడ్డాడు తప్ప ఆయనను ఎవరూ కొట్టలేదంటూ వక్రీకరణ వ్యాఖ్యలు చేసారు.
ఈ సంఘటన గురించి తెలుసుకున్నాక ఏం అర్ధమవుతోంది? అతివాద మనస్తత్వం కలిగిన వ్యక్తులు మన మధ్యలోనే సాధారణ మానవుల్లాగే తిరుగుతూ ఉంటారు. వారు తమకు నచ్చని మాట మాట్లాడితే చాలు విరుచుకుని పడిపోతారు. అసలు వారితో ప్రత్యక్షంగా మాట్లాడకపోయినా వారికి అనవసరం. తమను ఏదో అంటున్నారు అన్న అనుమానం వస్తే చాలు. ఒక రహస్య ప్రణాళిక ప్రకారం తమ బృందాన్ని ఒక చోట చేరుస్తారు. అవతలి వాళ్ళు ఏమన్నదీ కూడా తెలుసుకోకుండానే యధేచ్ఛగా దాడులకు పాల్పడతారు. తమతో సంబంధం లేకుండా వేరే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నా, ఆ విషయం తమకు వ్యతిరేకంగా ఉందని వారికి అనిపిస్తే చాలు, నిర్మొహమాటంగా దాడి చేసేస్తారు. ఒళ్ళంతా పచ్చిపుండు అయిపోయేలా చితకబాదుతారు. భావ ప్రకటనా స్వేచ్ఛ భారత పౌరులందరికీ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అన్న సంగతిని ఏమాత్రం పట్టించుకోరు.
అలాంటి మనస్తత్వం, తోటి పౌరులను సైతం ద్వేషించే గుణం, తమను ఏదో అనేస్తున్నారేమో అన్న అనుమానం, తమకు ఏదో జరిగిపోతోందన్న అభద్రతా భావం వారిని నిరంతరం వెన్నాడుతూనే ఉంటాయి. చిత్రంగా, అవతలి వ్యక్తికి సైతం తనదైన భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుందన్న విషయం వారికి గుర్తుండదు. తాము దేన్ని నమ్మితే దాన్నే మొత్తం ప్రపంచం నమ్మి తీరాలని మూర్ఖపు పట్టుదల ఉంటుంది. అందుకే ఇలాంటి దాడులకు పాల్పడతారు. కాm బట్టి, మీరు బైట ప్రయాణించేటప్పుడు మీ డ్రైవర్ ఎవరో గమనించుకోండి. మార్కెట్లో తిరుగుతున్నప్పుడు విక్రేతలు ఎవరో చూసుకోండి. బైట ప్రదేశాల్లో ఉన్నప్పుడు మీ చుట్టూ ఎవరున్నారో పరిశీలించుకోండి. ప్రజాస్వామిక ప్రభుత్వంలో కొంతమంది మిగతావాళ్ళకంటె అధికులనీ, ఈ దేశపు ఆస్తుల మీద వారికే హక్కులున్నాయనీ గుర్తు ఉంచుకోండి. అలాంటి వారి కంట్లో మీరు పడ్డారంటే మీమీద ఎప్పుడు ఎక్కడినుంచి ఎలాంటి దాడి జరుగుతుందో చూసుకోండి. తస్మాత్ జాగ్రత్త.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత