లాస్ ఏంజెలెస్‌లో 2028లో జరగనున్న ఒలింపిక్స్ పోటీల్లో పొట్టి క్రికెట్ కు అవకాశం దక్కింది. టీ20 ఫార్మాట్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఆరు జట్లు తలపడతాయని నిర్వాహకులు ప్రకటించారు. ఒక్కో జట్టులో 15 మంది ఆటగాళ్ళ చొప్పున 90 మంది క్రీడాకారులు ఉంటారని పేర్కొన్నారు. మహిళల విభాగంలో కూడా ఆరు జట్లు ఉంటాయని వివరించారు.
చివరగా 1900 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీలు జరిగాయి. అప్పట్లో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య రెండురోజుల మ్యాచ జరిగింది. మళ్ళీ 128 ఏళ్ల తర్వాత అవకాశం లభించింది.
2028 ఒలింపిక్ క్రీడల కోసం ఈవెంట్ ప్రోగ్రామ్, అథ్లెట్ కోటాలను ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు ధ్రువీకరణ తెలిపింది. రాబోయే ఒలింపిక్స్‌లో మొత్తం ఐదు కొత్త క్రీడలకు ఐఓసీ అనుమతి తెలపింది. అందులో క్రికెట్, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్ (సిక్సర్లు), స్క్వాష్‌లతో పాటు క్రికెట్‌ను చేర్చడానికి ఒలింపిక్ కమిటీ రెండేళ్ల క్రితమే సమ్మతి తెలిపింది.
1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మెన్స్ క్రికెట్ పోటీలు నిర్వహించగా 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో ఉమెన్స్ క్రికెట్ పోటీలు జరిగాయి.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత