భారత విమానయాన సంస్థ ఎయిరిండియాలో యువ ఫైలెట్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. విమానం ల్యాండ్ చేసిన కాసేపటికే 28 ఏళ్ల ఫైలెన్ అర్మాన్ గుండెపోటుకు గురయ్యారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బుధవారంనాడు శ్రీనగర్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే అర్మాన్ డిస్పాచ్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడికి వెళ్లగానే తీవ్ర గుండెపోటుతో అర్మాన్ ప్రాణాలు వదిలారు.
విమానం ల్యాండింగ్ కాగానే డిస్పాచ్ కార్యాలయానికి వెళ్లిన అర్మాన్ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తోటి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. విమానంలోనూ వాంతులు చేసుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. విమానం ల్యాండ్ అయ్యాక ఆయన చాలా నీరసంగా ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు.
యువ ఫైలెట్ అర్మాన్ మృతిపై ఎయిరిండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. పూర్తి వివరాలు ప్రకటించే వరకు ఊహాగానాలు ప్రచారం చేయవద్దని ఎయిరిండియా కోరింది. అర్మాన్ గుండెపోటుతో చనిపోవడంతో ఫైలెట్ల పని గంటలపై చర్చ సాగుతోంది.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత