వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించబోమని వక్ఫ్‌బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ స్పష్టం చేశారు. వక్ఫ్ ట్రైబ్యునల్‌ను మరింత పటిష్టం చేసేందుకు ముస్లిం స్కాలర్‌ను కూడా నియమించారన్నారు.
విజయవాడలోని వక్ఫ్‌బోర్డు కార్యాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడిన అబ్దుల్ అజీజ్, వక్ఫ్‌బోర్డు నుంచి వచ్చే ప్రతీ రూపాయి పేద ముస్లింలకు చెందాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అన్నారు. వక్ఫ్‌బోర్డు ఆస్తులు, మూడేళ్లకు మించి లీజుకు ఇవ్వాలంటే బోర్డు సమ్మతితోపాటు ముతవల్లీ, ప్రభుత్వమూ అంగీకారం తెలపాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు.
వక్ఫ్‌బోర్డుకు చెందిన వేల ఎకరాలు నిరుపయోగంగా ఉందన్న అబ్దుల్ అజీజ్, వాటిని ముస్లిం సమాజ అభివృద్ధికి వినియోగించడం బోర్డు బాధ్యత అని గుర్తు చేశారు. 30 వేల ఎకరాలను లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయంతో ముస్లింల అభ్యున్నతికి వినియోగిస్తామన్నారు. ముస్లింల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత