వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. మంత్రిగా పనిచేసిన సమయంలో నెల్లూరు జిల్లాలో వందల కోట్ల విలువైన క్వార్జ్ అక్రమంగా మైనింగ్ చేశారనే కేసు ఎదుర్కొంటున్నారు. దీనిపై సీఐడి విచారణ జరుపుతోంది. విచారణకు హాజరుకావాలంటూ పలు మార్లు నోటీసులు పంపినా కాకాణి గోవర్థన్‌రెడ్డి హాజరు కాలేదు. వారం రోజులుగా కాకాణి ఫోన్ కూడా స్విఛాప్ కావడంతో విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
కాకాణి గోవర్థన్‌రెడ్డి ముంబైలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని కోసం గాలింపు చేపట్టారు. హైదరాబాద్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. అతని సన్నిహితుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం కాకాణి గోవర్థన్‌రెడ్డి పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత