దుబాయ్‌లో తెలుగు మహిళపై యాసిడ్ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం పొన్నాడకు చెందిన లక్ష్మిపై యాసిడ్ దాడి చేసి, యజమాని పిచ్చాసుపత్రిలో చేర్పించారు. అక్కడి సిబ్బంది ఫోన్ చేయడంతో లక్ష్మి కుటుంబసభ్యులకు సమాచారం అందింది. లక్ష్మి ఓ ఏజంటు ద్వారా దుబాయ్‌లో ఇంటి పని చేసేందుకు వెళ్లింది. నెలకు 150 దినార్లు జీతం ఇస్తారని ఏజంటు చెప్పారు. అక్కడకు వెళ్లిన తరవాత యజమాని కేవలం 100 దినార్లు మాత్రమే చెల్లించాడు. లక్ష్మి నిలదీయడంతో ఆమెపై యాసిడ్ పోసి, పిచ్చాసుపత్రిలో చేర్పించారు.
ఆసుపత్రిలో కోలుకున్న తరవాత విషయం తెలుసుకున్న డాక్టర్లు లక్ష్మి కుటుంబానికి సమాచారం అందించారు. దుబాయ్ పోలీసులకు విషయం చెప్పడంతో వారు కేసు నమోదు చేశారు. లక్ష్మి పాస్ పోర్టు ఆమె యజమాని వద్ద ఉందని, కేసు వెనక్కు తీసుకుంటేనే పాస్ పోర్టు ఇస్తామంటూ బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు. ఏజంటును సంప్రదించగా డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు లక్ష్మి కుటుంబ సభ్యులు తెలిపారు. లక్ష్మిని భారత్ తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబసభ్యులు కోరుతున్నారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత