అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల పెంపు అమలు 90 రోజులు వాయిదా వేయిడంతో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. బుధవారం ఒకే రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 2350 పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం 93310 దాటిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర పరుగులు పెట్టింది. ఔన్సు బంగారం ఒకే రోజు 100 డాలర్లు పెరిగి 3085 అమెరికా డాలర్లకు ఎగబాకింది. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధర పరుగులు పెట్టింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంట్ గోల్డ్ 89910 దాటిపోయింది. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి 94వేలకు చేరింది.
భారత్ ఏటా 800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 200 టన్నుల బంగారం ఆభరణాలు తయారు చేసి ఎగుమతి చేస్తోంది. బంగారం దిగుమతులకు భారత్ ఏటా 6 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యం చెల్లించాల్సి వస్తోంది. బంగారం ధరలు విపరీతంగా పెరగడం వాణిజ్య లోటుకు దారితీస్తుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత