పరస్పర సుంకాల పెంపుతో ప్రపంచ దేశాలను బెంబేలెత్తించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతించారు. పెంచిన సుంకాల అమలు 90 రోజుల పాటు వాయిదా వేశారు. అయితే చైనాపై పెంచిన సుంకాలు తగ్గించకపోగా మరింత పెంచారు. మరో మూడు నెలల పాటు మిగిలిన దేశాల్లో పాత టారిఫ్ 10 శాతం అమలు చేయనున్నారు.
చైనాపై ట్రంప్ మరోసారి సుంకాలు పెంచారు. దీంతో చైనాపై 125 శాతం సుంకం విధించినట్లైంది. చైనా కూడా దీటుగా బదులిచ్చింది. అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకాలను విధించింది. కెనడా, ఐరోపా దేశాలు కూడా సుంకాలను పెంచాయి. పలు దేశాలు సుంకాల విషయంలో సంప్రదింపులకు రావడంతో 90 రోజులు అమలు వాయిదా వేసినట్లు ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ స్టాక్ మార్కెట్లు దారుణంగా పతనమైన నేపథ్యంలోనే సుంకాల పెంపు అమలు వాయిదా వేయాలనే ప్రచారం జరుగుతోంది.
చైనాలో అమెరికా 34 శాతం సుంకాలను ప్రకటించింది. గతంలో అప్పటికే అమల్లో ఉన్న సుంకాలతో కలపి 54 శాతానికి చేరింది. ప్రతీకారంగా అమెరికాపై చైనా 34 శాతం సుంకాలను పెంచింది. దీంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. చైనా వెనక్కు తగ్గకపోతే అదనంగా 50 శాతం సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. అయినా చైనా వెనక్కు తగ్గలేదు. బుధవారంనాడు 50 శాతం సుంకాలను విధించడంతో మొత్తం 104 శాతానికి చేరింది. బుధవారం సాయంత్రానికి అది 125 శాతానికి పెంచారు.
అమెరికా చర్యలను తీవ్రంగా తీసుకున్న చైనా వెంటనే 50 శాతం పరస్పర సుంకాలను వేసింది. గతంలో ఉన్న 34 శాతం కలుపుకుంటే మొత్తం 84 శాతానికి చేరింది. గురువారం నుంచే అమల్లోకి వస్తుందని చైనా ప్రకటించింది. అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థలో కేసు వేస్తామని చైనా హెచ్చరించింది.
ప్రపంచ దేశాలపై పెంచిన సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ మొదటగా ప్రకటించారు. తరవాత 90 రోజులు వాయిదా వేశారు. తాజాగా చైనాలో 125 శాతం, భారత్‌పై 26 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి. బుధవారం సాయంత్రానికే ట్రంప్ నిర్ణయం మార్చుకోవడంతో సుంకాల పెంపు అమలు 90 రోజులు వాయిదా పడింది.
ఔషధాలపై కూడా త్వరలో సుంకాలు వేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఇక నుంచి ఔషధాలు అమెరికాలోనే తయారవుతాయన్నారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆటోమొబైల్ ఉత్పత్తులపై కెనడా 25 శాతం సుంకాలను విధించింది. అమెరికా, కెనడా ఒప్పందాన్ని గౌరవించని కారణంగానే తాజాగా సుంకాలను పెంచినట్లు కెనడా ప్రకటించింది. పెంచిన సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని కెనడా ఆర్థిక మంత్రి ఫ్రాంకోయిస్ ఫిలిప్ ప్రకటించారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత