రూ.1,332 కోట్లతో డంబ్లింగ్ పనులు
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి అధిక ప్రాధాన్యమిస్తోందన్న విషయం మరోసారి రుజువు అయింది. అమరావతి అభివృద్ధి, రైల్వే ప్రాజెక్టులు, కేంద్రప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు విషయంలో ఏపీకి ప్రాధాన్యమిస్తోన్న కేంద్రం, మరో కీలక ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది.
తిరుపతి-పాకాల-కాట్పాడిల రైలుమార్గంలో డబ్లింగ్ పనులు చేపట్టాలని కేంద్రమంత్రివర్గం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పొడవు 104 కిలోమీటర్లు కాగా రూ.1,332 కోట్లతో డంబ్లింగ్ పనులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బుధవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. పీఎం గతిశక్తి పోర్టల్ ఆధారంగా రైల్వే నెట్‌వర్క్‌ను విశ్లేషించి అత్యంత రద్దీగా ఉండే ఈ సెక్షన్ను డబ్లింగ్ చేయాలని నిర్ణయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్ వివరించారు. ఈ లైన్ ను అభివృద్ధి చేస్తే కర్ణాటక, కేరళ, తమిళనాడుల నుంచి ఉత్తర భారతదేశం వైపు వెళ్లే రైళ్లకు రద్దీ తగ్గుతుందన్నారు. తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలు, చంద్రగిరి కోటకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని వివరించారు.
డబ్లింగ్ మార్గంలో 15 స్టేషన్లు, 17 పెద్ద వంతెనలు, 327 చిన్నవంతెనలు, 7 ఆర్‌ఓబీలు, 30 ఆర్‌యూబీలు రానున్నాయి. ఈ ప్రాజెక్టుతో రాయలసీమకు ప్రయోజనం చేకూరనుంది. ఈ మార్గం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఏటా 40 లక్షల టన్నుల సరకు అదనంగా రవాణా చేయడానికి వీలవుతుంది.
తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వేలైన్ డబ్లింగ్‌తో ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు అనుసంధానత పెరగడంతో పాటు సరకు రవాణా సామర్థ్యమూ పెరుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
తిరుపతి-కాట్పాడి రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల అనుసంధానం, పురోగతిలో ఈ నిర్ణయంతో కొత్తశకానికి నాందీవాచకంగా మారిదని అన్నారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ, రైల్వేమంత్రి అశ్వినీవైష్ణవ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత