ఐపీఎల్ 2025 లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. ఐపీఎల్ 18 వ విడత లో గుజరాత్ టైటాన్స్ వరుసగా నాలుగో విజయం సాధించడం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో రాజస్థాన్ 19.2 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది.దీంతో గుజరాత్ టైటాన్స్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఓపెనర్ సాయి సుదర్శన్ రాణించడంతో గుజరాత్ టైటాన్స్ భారీగా పరుగులు చేయగల్గింది. మరోఓపెనర్ గా వచ్చిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ (2) విఫలమైనప్పటికీ సాయి సుదర్శన్, జోస్ బట్లర్ నిలకడగా ఆడి స్కోర్ బోర్డ్ వేగాన్ని పెంచారు. సాయి సుదర్శన్ 53 బంతుల్82 పరుగులు చేశాడు. బట్లర్ (36), షారుఖ్ ఖాన్( 36), రాహుల్ (తెవాటియా 24 నాటౌట్) రాణించారు. రూథర్ ఫర్డ్, రషీద్ ఖాన్ నిరాశపరిచారు.
రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్ పాండే , మహీశ్ తీక్షణ చెరో రెండు వికెట్లుపడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ , సందీప్ శర్మ చెరొక వికెట్ తీశారు.
గుజరాత్ టైటాన్స్ విధించిన లక్ష్యాన్ని అందుకోవడంలో రాజస్థాన్ రాయల్స్ విఫలమైంది. హెట్‌మయర్ (52), సంజు శాంసన్ (41), పరాగ్ (26) మినహా మిగతావారు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు.
జైస్వాల్ (6), నితీశ్ రాణా(1), ధ్రువ్ జురైల్ (5), శుభమ్ దూబే (1), జోఫ్రా ఆర్చర్ ( 4), మహీశ్ తీక్షణ(5), తుషార్ దేశ్ పాండే (3) విఫలం అయ్యారు.
గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు తీయగా, రషీద్‌ఖాన్, , సాయి కిషోర్ చెరో రెండు వికెట్లు తీశారు. సిరాజ్, అర్షద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత