భారత నౌకాదళానికి అత్యాధునిక ఫైటర్ జెట్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఫ్రాన్స్ నుంచి 26 రఫేల్ మెరైన్ ఫైటర్ విమానాల కొనుగోలు ఒప్పందానికి ఆమోద ముద్ర వేసింది. ఆ ఒప్పందం విలువ 63వేల కోట్ల పైమాటే అని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. 22 సింగిల్ సీటర్ విమానాలు, 4 ట్విన్ సీటర్ విమానాల కొనుగోలు, నిర్వహణ, విడిభాగాలు, లాజిస్టిక్ సపోర్ట్, శిక్షణకు సంబంధించిన అంశాలు ఉంటాయని తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఆ ఒప్పందానికి ఆమోద ముద్ర వేసింది. మొదటి బ్యాచ్ విమానాలు 2029లో భారతదేశానికి చేరుకోవచ్చు. మొత్తం విమానాలు 2031 నాటికే వచ్చే అవకాశాలున్నాయి. ఈ విమానాలను ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకలపై మోహరిస్తారు. ప్రస్తుతం ఉన్న మిగ్ 29కె విమానాల స్థానంలో ఈ విమానాలను ఉపయోగిస్తారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత