భారత విదేశీ వ్యహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆ దేశంలోని పలువురు వ్యక్తులు బహిరంగంగానే చెబుతున్నారని జయశంకర్ అన్నారు. ఓ ప్రైవేటు మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జయశంకర్ పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు దానికి మూల్యం చెల్లించుకుంటోందని వ్యాఖ్యానించారు. ముంబై నగరంపై 26/11 దాడుల్లో కీలక సూత్రధారి తహావుర్ రాణాను భారత్‌కు అప్పగించాలని అమెరికా న్యాయస్థానాలు వెలువరించిన ఉత్తర్వును జయశంకర్ స్వాగతించారు. తహావుర్ రాణాను భారత అధికారుల బృందం ప్రత్యేక విమానంలో భారతదేశానికి తీసుకొస్తోంది. ఆ విమానం రేపు తెల్లవారు జాము వేళకు భారతదేశంలో దిగుతుందని సమాచారం.