విభజనవాద రాజకీయాలు, మత తత్వాన్ని ఎదుర్కోడానికి సర్దార్ వల్లభ భాయి పటేల్ స్ఫూర్తితో పోరాడతామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. హింస, మత తత్వం మన దేశాన్ని సముద్రంలోకి నెట్టేస్తున్నాయని ఆ పార్టీ అభిప్రాయ పడింది. అహ్మదాబాద్‌లోని పటేల్ స్మారకం దగ్గర నిర్వహించిన గుజరాత్ సీడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
పటేల్, నెహ్రూల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ గాంధీ, నెహ్రూ, పటేల్‌ల నాయకత్వాన్ని విడదీసి చూడలేమది. పటేల్, నెహ్రూ మధ్య ఆదర్శాల్లో విభేదాలున్న మాట వాస్తవమే అయినా వారిద్దరి మధ్య పరస్పర గౌరవం ఉండేదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు.
నెహ్రూ – పటేల్ మధ్య విభేదాలు ఉన్నట్లు బీజేపీ ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేసారు. గాంధీకి చెందిన సంస్థలను బీజేపీ, సంఘ్ పరివార్ స్వాధీనం చేసుకుంటున్నాయని, ఆయన సిద్ధాంతాల వ్యతిరేకులకు అప్పగిస్తున్నాయని ఆరోపించారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత