తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తండ్రి కుమారి అనంతన్ తుదిశ్వాస విడిచారు. 93ఏళ్ళ కుమారి అనంతన్, తమిళనాడు కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడిగా ఉండేవారు. ఆయన అసలు పేరు అనంత కృష్ణన్. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారు. కొంతకాలం తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. వృద్ధాప్యం కారణంగా కొన్నాళ్ళుగా ఆయన ఆరోగ్యం బాగుండడం లేదు. కొద్ది రోజుల క్రితం ఆయనను చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఉదయం ఆయన మరణించారు. అనంత కృష్ణన్ మరణానికి పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఇవాళ ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం తమిళిసై సౌందరరాజన్ నివాసంలో ఉంచారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా వివిధ రంగాలకు సంబంధించిన పలువురు ప్రముఖులు అనంతన్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు అనంతన్.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత