పాస్‌పోర్ట్ సేవా మొబైల్ వ్యాన్ సిద్ధం
ఆంధ్రప్రదేశ్ లో పాస్ పోర్ట్ జారీ మరింత సులువుగా మారింది. పాస్ పోర్ట్ కోసం గ్రామీణులు నగరానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంటి ముంగిటే జారీ చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యటు చేసింది. నలుగురు సిబ్బందితో కూడిన ‘పాస్‌పోర్టు సేవా మొబైల్ వ్యాన్’ సిద్ధం చేశారు. కార్యాలయానికి వెళ్లలేని వారు, మారుమూల ప్రాంత ప్రజలు ఊరిలోనే ఉండి ఈ వ్యాన్ సాయంతో పాస్‌పోర్టు పొందొచ్చు. ఈ వాహనాన్ని మంగళవారం విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభం సందర్భంగా సిద్ధంగా చేశారు.
వ్యాన్ ఎప్పుడు, ఎక్కడికి వస్తుందో అధికారులు సంబంధిత వెబ్సైట్ ద్వారా ముందుగానే తెలియజేస్తారు. పాస్‌పోర్టు కావాల్సిన వారు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని, వ్యాన్ వద్దకు వెళ్తే సరి పోతుంది. సర్టిఫికెట్లు పరిశీలించి, వేలిముద్రలు, ఫొటోలు తీసుకుని ప్రక్రియ పూర్తి చేస్తారు. త్వరలో పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు.
విదేశీ ప్రయాణానికి అంతరాయల్లేకుండా ఉండేందుకు ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సులభతరం చేయడానికి కొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు కేంద్ర సహాయమంత్రి కీర్తివర్థన్ సింగ్ తెలిపారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఐడీఎఫ్) చిప్‌తో కూడిన పీఎస్పీ-2 వెర్షన్ ఈ-పాస్పోర్ట్స్ జారీ చేయనున్నట్లు వివరించారు. విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని, ఉన్నతీకరించిన పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని మంగళవారం నాడు ఆయన ప్రారంభించారు. అమరావతిలో ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం రెండెకరాలు కేటాయించడం అభినందనీయమన్నారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత