పాపికొండల అభయారణ్య ప్రాంతంలోని అరుదైన అడవి అలుగులు సంచరిస్తున్నాయి. ఈ అలుగులను పాంగోలియన్ అని కూడా పిలుస్తారు. చైనీస్ పాంగోలియన్, ఆసియా పాంగోలియన్, సుండా పాంగోలియన్, పాతమాన్ పాంగోలియన్ అనే నాలుగు రకాలు అలుగులు ఉన్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. వీటి జీవితకాలం 20 ఏళ్ళు కాగా చీమలు, పురుగులను ఆహారంగా తీసుకుంటుంది. పొడవైన నాలుక కలిగి ఉంటుంది. ధృడమైన పెంకులను చర్మంపై రక్షణగా ఉంటాయి. అడవి జంతువుల నుంచి రక్షణ కోసం ముడుచుకుపోవడం దీని లక్షణం.
1821లో తొలిసారిగా ఈ జంతువుల సంచారాన్ని వైల్డ్‌లైఫ్ అధికారులు గుర్తిచారు. వన్యప్రాణులు పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 25 నుంచి 30 పైగా సంచరిస్తున్నాయి. పగటిపూట గోతుల్లో, తొర్రల్లో, చెట్ల పైన దాగి , రాత్రివేళ సంచరిస్తాయి.రెండేళ్ళకోమారు సంతానోత్పత్తి ఉంటుంది. కోతి మాదిరిగానే తాను జన్మనిచ్చిన పిల్లలను వీపుపై ఎక్కించుకుని ఆహార అన్వేషణ చేస్తుంది.
ఈ అరుదైన జీవజాలంపై స్మగ్లర్ల కన్ను పడింది. వీటి చర్మంపై ఉండే పెంకులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. విదేశాల్లో రూ.లక్షల్లో ఉంటుందని అంటున్నారు. గతంలో ఓ అలుగును బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు రూ.20 లక్షలకు విక్రయిస్తామని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన విషయాన్ని అధికారులు గుర్తు చేవారు. అరుదైన వన్య ప్రాణులను వేటాడి విక్రయించాలని కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఏడేళ్ళ వరకు శిక్ష పడటంతో పాటు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధిస్తారని అధికారులు చెబుతున్నారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత