అమరావతి స్వగృహ నిర్మాణంలో భాగంగా ఈ రోజు సీఎం చంద్రబాబు భూమిపూజ చేశారు. ఉండవల్లి లోని అతిథి గృహం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి శంకుస్థాపన ప్రదేశానికి చంద్రబాబు వెళ్ళారు. ఉదయం 8.51 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు వెలగపూడి రైతులు పట్టవస్త్రాలు అందజేశారు.
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనక E9 రహదారి పక్కనే చంద్రబాబు ఇల్లు కడుతున్నారు. గత ఏడాది డిసెంబరులో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్‌ను ఓ రైతు నుంచి చంద్రబాబు కొనుగోలు చేశఆరు.
ఈ నివాసాన్ని 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జి ప్లస్ 1గా నిర్మించనున్నారు. ఎస్ఆర్ఆర్ నిర్మాణ సంస్థ ఈ కాంట్రాక్టును తీసుకుంది. ఏడాదిలోపు ఇల్లు నిర్మించే లక్ష్యంగా పనులు మొదలు కానున్నాయి. కేవలం ఐదు రోజుల్లోనే ఐదు ఎకరాల స్థలాన్ని యుద్ధ ప్రాతిపదికన చదును చేశారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత