ఐపీఎల్-2025 లో భాగంగా న్యూ చండీగఢ్ లో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య 42 బంతుల్లో 103 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ (52*), మార్కో యాన్సెస్ (34*) పరుగులు చేయగా మిగతా వారు విఫలమయ్యారు. ప్రభ్‌సిమ్రన్ డకౌట్ కాగా శ్రేయస్ అయ్యర్ (9), స్టాయినిస్ (4), నేహల్ వధేరా (9), మ్యాక్స్‌వెల్ (1) నిరాశపరిచారు. సీఎస్కే బౌలర్లలో ఖలీల్ అహ్మద్ , అశ్విన్ చెరో రెండు, నూర్ అహ్మద్, ముకేశ్ చౌదరి చెరో వికెట్ పడగొట్టారు.
లక్ష్యఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 201 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే (69), రిటైర్డ్ ఔట్ అవ్వగా శివమ్ దూబె (42), రచిన్ రవీంద్ర (36) పరుగులు సాధించారు. ధోనీ (27) దూకుడుగా ఆడినా సీఎస్కేకే ఓడంది. పంజాబ్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు వికెట్లు తీయగా , మ్యాక్స్‌వెల్, యశ్ ఠాకూర్ ఒక్కో వికెట్ తీశారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత