ఐపీఎల్ -2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్( 81), నికోలాస్ పూరన్ (87), ఐడెన్ మార్క్రమ్ (47) పరుగులు చేశారు.
భారీ టార్గెట్ ఛేదనలో కోల్ కతా నైట్ రైడర్స్ పోరాడి ఓడింది. కెప్టెన్ అజింక్యా రహానే 35 బంతుల్లో 61 పరుగులు చేయగా, వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 41 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (15) మరోసారి నిరాశపరిచినప్పటికీ మరో ఓపెనర్ సునీల్ నరైన్ 13 బంతుల్లోనే 30 పరుగులు సాధించాడు.
రింకూ సింగ్ 15 బంతుల్లో 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఆఖరి ఓవర్లో విజయానికి 24 పరుగులు అవసరం కాగా, కోల్ కతా జట్టు 19 పరుగులు మాత్రమే సాధించింది.
లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో ఆకాశ్ దీప్ , శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు తీశారు. అవేష్ ఖాన్ , దిగ్వేష్ రాఠీ , రవి బిష్ణోయ్ చెరొక వికెట్ తీశారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత