చంద్రబాబుకు ఊడిగం చేసే వారి ఉద్యోగాలు ఊడగొడతానని వ్యాఖ్య
సీఎం చంద్రబాబు ఎల్లకాలం అధికారంలో ఉండరన్న వైసీపీ అధినేత జగన్, అధికార పార్టీ దౌర్జన్యాలకు పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.
అక్రమార్కులతో కొందరు పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. లింగమయ్య హత్య అందుకు ఘటన అన్నారు.
పిన్నెల్లి రామకృష్ణపై కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధించారన్న వైఎస్ జగన్, పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారన్నారు . నందిగం సురేష్‌పై తప్పుడు కేసులు పెట్టి 145 రోజులు జైల్లో ఉంచారని, ఇవన్నీ ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలే అన్నారు. చంద్రబాబు దౌర్జన్యకాండకు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు.
చంద్రబాబుకు బలం లేదని స్థానిక ఎన్నికల ద్వారా రుజువైందన్న జగన్, 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్సీపీ గెలిచిందన్నారు. చంద్రబాబుకు అనుకూలంగా లేదని 7 చోట్ల ఎన్నిక వాయిదా వేయించారని చెప్పారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత