బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా త్వరలో స్వదేశానికి వెళ్ళాలని భావిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా తన పార్టీ అవామీ లీగ్ కార్యకర్తలతో ఆమె సంభాషించారు. ఏదో ఒక కారణం వల్లే అల్లా తనను ఇంకా బతికించాడని హసీనా అభిప్రాయపడ్డారు. అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకున్న వారికి బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు. త్వరలోనే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని భరోసా ఇచ్చారు.
ఆ సందర్భంగా హసీనా, ప్రస్తుత పాలకుడు మొహమ్మద్ యూనుస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అతని పాలనలో బంగ్లాదేశ్ ఉగ్రవాద దేశంగా మారిందన్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఎన్నో నేరాలు జరుగుతున్నాయనీ, మీడియా కూడా భయంతో వాటిని వెల్లడించడం లేదనీ హసీనా వివరించారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత