విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గా అమ్మవారి ఆలయంలో నేటినుంచీ చైత్ర మాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. అందులో భాగంగా ఇవాళ ఉదయం శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామివార్లకు మంగళ స్నానాలు ఆచరింపజేసారు. ఆ తరువాత వారిని వధూవరులుగా అలంకరించారు. కనకదుర్గమ్మ కళ్యాణ ప్రయత్నాలను విఘ్నేశ్వర పూజతో ప్రారంభించారు. అంకురార్పణ, అఖండ దీపస్థాపన, కలశారాధన, బలిహరణ, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం కార్యక్రమాలను ఇవాళ సాయంత్రం నిర్వహించారు. ఆ తర్వాత వెండి పల్లకీ సేవ నిర్వహించారు. ఆరు రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 13న ముగుస్తాయి.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత