ఆంధ్రప్రదేశ్లో రూ.80 వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ రాబోతోందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి ఢిల్లీలో ప్రకటించారు. దేశంలో పలు కంపెనీలు చమురు రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయని గుర్తుచేశారు. పెట్టుబడులు ఆకర్షించడంలో ఏపీ, గుజరాత్, ఒడిషా ముందు వరుసలో ఉన్నాయన్నారు. ఒడిషాలోని పారదీప్ వద్ద భారీ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు భారీగా కొనుగోలు చేసి నిల్వ చేసుకునే సదుపాయాలు మెరుగు పరుస్తామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 60 డాలర్లు ఉందని గుర్తుచేశారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత