నగరాల్లో లైంగిక వేధింపులు సర్వ సాధారణమేనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర క్షమాపణలు చెప్పారు. ఆయన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదం కావడంతో ఆయన క్షమాపణలు చెప్పారు. తమ మాటలకు మహిళలు బాధపడి ఉంటే క్షమించాలంటూ ఆయన కోరారు.
తాను చేసిన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకున్నారని, కొందరు వాటిని వక్రీకరించే అవకాశం ఇవ్వదలచుకోలేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నానని, మహిళల భద్రతపై తాను నిరంతరం ఆందోళన చెందే వారిలో తాను కూడా ఉంటానన్నారు. మహిళల భద్రత కోసం నిర్భయ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నట్లు చెప్పారు.తన మాటలకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు.
గత వారం బెంగళూరు సుద్దగుంటెపాల్య ప్రాంతంలో ఇద్దరు యువతులు నడుచుకుంటూ వెళుతుండగా, ఓ వ్యక్తి వేగంగా వచ్చి తాకి వెళ్లిపోయాడు. ఆ యువతులు భయపడి షాక్‌నకు గురయ్యారు. అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. అయితే ఆ వీడియో వైరల్ అయింది. దీన్ని పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేశారు.
బెంగళూరు లాంటి నగరాల్లో ఇలాంటి ఘటనలు సాధారణమేనంటూ హోం మంత్రి పరమేశ్వర వ్యాఖ్యానించారు. యువతిపై లైంగిక దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడ్డారు. బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మహిళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. దీంతో హోం మంత్రి క్షమాపణలు చెప్పారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత