గిరిజన విద్యార్థులు ఓ మహా అద్భుత కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అరకులోయలోని డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం ‘మహా సూర్య వందనం’ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రపంచ ఘనత సాధించారు.
గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఈ తరహా కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు అవ్వడం అభినందనీయమన్నారు. చదువుతోపాటు క్రీడలు, సామాజిక సేవల్లో విద్యార్థులు రాణించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో 13 వేల మంది గిరిజన బాలికలు పాల్గొనడం అరుదైన విషయం అన్నారు.
ఆశ్రమ పాఠశాలల విద్యార్థులను ఐదు నెలలుగా ఉదయాన్నే నిద్రలేపి యోగాసనాలు వేయించి సుశిక్షితులుగా చేశామని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. యోగాసనాల కారణంగా విద్యార్థుల్లో పఠనాశక్తి, శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందన్నారు. ప్రపంచ రికార్డు సాధనకు సహకరించిన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులను ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు.
ప్రముఖ యోగా గురు పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వరల్డ్ రికార్డ్ యనియన్ సంస్థ ప్రతినిధి అలిస్ రేనాడ్ రికార్డు చేసి కలెక్టర్ దినేష్కుమార్కి ధ్రువపత్రం అందజేశారు.
ప్రపంచ రికార్డు ధ్రువపత్రాన్ని కలెక్టర్ దినేష్కుమార్కి అందజేస్తున్న వరల్డ్ రికార్డ్ యనియన్ సంస్థ ప్రతినిధి అలిస్ రేనాడ్
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత