కియా పరిశ్రమలో దొంగలు పడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో కియా పరిశ్రమలో 900 కార్ల ఇంజన్లు మాయమయ్యాయి. 900 ఇంజన్లు పోయాయంటూ, కియా యాజమాన్యం మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరిపారు. త్వరలో దీనిపై విచారణ వివరాలు మీడియాకు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
కియాకు ఇంజన్లు తమిళనాడు నుంచి వస్తున్నాయి. మార్గమధ్యంలో మాయం చేశారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రానికి దీనిపై పోలీసులు కొంత సమాచారం మీడియాకు అందించే అవకాశముంది.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత