ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డారు. సింగపూర్లో మార్క్ శంకర్ పవనోవిచ్ చదువుకుంటోన్న పాఠశాలలో చెలరేగిన మంటల్లో అతడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పాఠశాల సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని సన్నిహితులు సూచించారు. అయినా ముందుగా ఇచ్చిన మాట మేరకు కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకున్న తరవాత, సింగపూర్ బయలు దేరతానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఇవాళ సాయంత్రానికి అల్లూరి సీతామారరాజు జిల్లాలో కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆయన ప్రత్యేక విమానంలో సింగపూర్ బయలు దేరనున్నారు.
ఎస్వీ గోశాలలపై వైసీపీ నేత భూమన అసత్య ప్రచారం : హోం మంత్రి అనిత