ఐపీఎల్-2025లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడి నాలుగింట ఓడింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మారాయి.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. తొలి ఓవర్ లో ఫిల్ సాల్ట్ (4) వికెట్‌ను కోల్పోయినప్పటికీ కోహ్లీ, పడిక్కల్ కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. పడిక్కల్ 22 బంతుల్లో 37 పరుగులు చేశాడు. కోహ్లీ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. లివింగ్‌స్టోన్ (0) నిరాశ పరచగా జితేశ్ శర్మ 19 బంతుల్లో రెండు ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు.
ఆర్సీబీ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఛేదించలేకపోయింది. రోహిత్ శర్మ (17) మరోమారు నిరాశ పరిచగా సూర్యకుమార్ యాదవ్ (28) కూడా విఫలమయ్యారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడి 15 బంతుల్లో 42 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 29 బంతుల్లో 59 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా మిగతా వారు విఫలం కావడంతో ఓటమి చెందింది.
ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్యా నాలుగు వికెట్లు తీయగా , యశ్ దయాళ్, హేజెల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు.