వంట గ్యాస్ ధరలు పెరిగాయి. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ధరల పెంపు ఉజ్వల పథకం లబ్దిదారులకు కూడా వర్తిస్తుందని కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురీ వెల్లడించారు.
గత వారం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. హాటళ్లు, రెస్టారెంట్లు ఉపయోగించే వాణిజ్య గ్యాస్ ధరను కేంద్రం రూ.41 పెంచింది. పలు రాష్ట్రాల్లో రాయితీలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.
ఇవాళ మధ్యాహ్నం పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం రూ.2 ఎక్సైజ్ పన్ను పెంచింది. దీని ప్రభావం వినియోగదారులపై పడబోదని కేంద్రం స్పష్టం చేసింది. పెంచిన ఎక్సైజ్ పన్నును కంపెనీలు భరిస్తాయని కేంద్రం తెలిపింది. పెంచిన ధర ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి