కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలోని హోంమంత్రి జి పరమేశ్వర వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. పెద్దపెద్ద నగరాల్లో మహిళలపై దాడులు జరగడం సాధారణం అని వ్యాఖ్యానించారు. దానిపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం చెలరేగింది.
బెంగళూరులో ఇటీవల ఒక యువతిపై లైంగిక దాడి జరిగింది. దాని గురించి మాట్లాడుతూ బెంగళూరు లాంటి మహా నగరాల్లో వీధుల మీద మహిళలపై అలాంటి దాడులు జరగడం మామూలే అన్నారు. నిందితుణ్ణి పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మహిళలను వేధించిన ఆకతాయి మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
గతవారం సుద్దగుంటెపాలెంలో ఒక వీధిలో ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వెడుతున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు వారిపై దాడి చేసారు. ఒక వ్యక్తి ఒక మహిళను అసభ్యంగా తాకాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించకపోయినా, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బెంగళూరు పోలీసులు సు మోటో కేసు నమోదు చేసారు. దర్యాప్తు చేస్తున్నారు.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి