మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. తన మీద నమోదైన కేసులను కొట్టేయాలంటూ ఆయన న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసారు.
కునాల్ ఇటీవల ముంబైలోని ఒక హోటల్లో స్టాండప్ కామెడీ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండేను ‘ద్రోహి’ అంటూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఈ కేసు విచారణ కోసం పోలీసులు కునాల్ కామ్రాకు ఇంటి దగ్గరే మూడుసార్లు సమన్లు జారీ చేసారు. అయితే ఏ ఒక్కదానికీ కునాల్ స్పందించలేదు.
తన మీద నమోదు చేసిన కేసుల వల్ల భారత రాజ్యాంగం తనకు ప్రసాదించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, జీవించే హక్కు ఉల్లంఘనకు గురవుతున్నాయని కునాల్ కామ్రా తన పిటిషన్లో పేర్కొన్నారు. కునాల్ కామ్రా పిటిషన్పై ఏప్రిల్ 21న విచారణ జరగనుంది.
కునాల్ తమిళనాడులోని విలుప్పురం నివాసి. అందువల్ల ఆయనపై మద్రాసు హైకోర్టులోనూ ఈ మధ్య పిటిషన్ దాఖలైంది. మరోవైపు, పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. దానికి స్పందనగా న్యాయస్థానం ఇవాళ్టి వరకూ రక్షణ కల్పించింది.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి