అమరావతిలో గ్లోబల్ మెడికల్ సిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలోనూ వంద నుంచి 3వందల పడకల ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
వైద్య, ఆరోగ్య రంగాలపై ముఖ్యమంత్రి ఇవాళ మీడియాకు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో గుండె జబ్బులు, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు బాగా పెరుగుతున్నాయన్నారు. హైపర్‌టెన్షన్ పురుషులలో కంటె మహిళల్లో ఎక్కువగా ఉందని గమనించారు. ఆహారపు అలవాట్లపై నియంత్రణ లేకపోవడం వల్ల కొన్ని జిల్లాల్లో మధుమేహం ఎక్కువగా ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ ఏర్పాటు చేసామని వెల్లడించారు.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి