ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం రూ.4285 కోట్లు విడుదల చేసింది. అమరావతి నిర్మాణ పనుల ప్రారంభోత్సవం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల మూడో వారంలో వస్తారు. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది.
అమరావతిలో నిర్మాణ పనులను మళ్ళీ ప్రారంభిస్తున్న సందర్భంలో 25శాతం నిధులు అడ్వాన్సుగా ఇవ్వాలని అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ – ఏపీ సీఆర్డీఏ కేంద్రాన్ని కోరింది. దానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకుల నిధుల నుంచి 25శాతం మంజూరు చేసింది. దానికి కేంద్రం వాటా రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.4285 కోట్లు విడుదల చేసింది.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి