విశ్వావసు నామ సంవత్సర వసంత నవరాత్రుల్లో తొమ్మిదవ రోజైన సోమవారం ఏప్రిల్ 7న కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన మంత్రపూర్వకంగా జరిగింది. ఈ రోజుతో నవరాత్రులు పూర్తవడంతో పుష్పార్చనలు ముగిసాయి. ఆ సందర్భంగా పూర్ణాహుతి నిర్వహించారు.
పుష్పార్చనల ఆఖరి రోజైన ఇవాళ, నటరాజ స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పూజా మండపంలో ఉదయం 9 గంటల నుండి పుష్పార్చన వైభవంగా ప్రారంభమైంది. కనకదుర్గమ్మకు కనకాంబరాలు, గులాబీ పూలతో అర్చన చేసారు. అమ్మవారి ప్రధాన ఆలయం నుండి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ ఆలయ అర్చకులు, సిబ్బంది వెదురు బుట్టలతో పుష్పాలను అర్చన ప్రాంగణానికి తీసుకొని విచ్చేసారు. అనంతరం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరై పుష్పార్చన వైభవాన్ని చూసి తరించారు. తరువాత వసంత నవరాత్రులు, పుష్పార్చనల ముగింపు సందర్బంగా పూర్ణాహుతి జరిగింది.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి