అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హంద్రీనీవా కెనాల్ పీలేరు యూనిట్ 2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమ దుర్మరణం పాలయ్యారు. రమ ప్రయాణిస్తోన్న కారు, మరో కారు వేగంగా ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. కొద్దిసేపటి కిందట జరిగిన ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను కలెక్టర్ శ్రీధర్ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ప్రమాదంలో చనిపోయిన రమ, అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్ సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. రమ స్వస్థలం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంగా పోలీసులు వెల్లడించారు.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి