గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ వేగం అందుకుంది. ఖర్చులు తగ్గించుకుని సామర్థ్యాలు పెంచుకునేందుకు గ్రామీణ బ్యాంకులను కుదించాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పని చేస్తున్నాయి. వాటిని 28కు తగ్గించనున్నారు.
దీనికి సంబంధించిన పనులు కొలిక్కి వచ్చాయని, దేశంలో నాలుగో విడత బ్యాంకుల ఏకీకరణ త్వరలో జరగనుందని కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. విలీనం కానున్న గ్రామీణ బ్యాంకుల్లో ఏపీలో 4, యూపీ, బెంగాల్ 3 చొప్పున ఉన్నాయి. బిహార్, గుజరాత్, జమ్ము అండ్ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 2 చొప్పున ఉన్నాయి.
తెలంగాణ, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు ఆస్తులు, అప్పులను ఏపీజీవీబీ, తెలంగాణ గ్రామీణ బ్యాంకుల మధ్య విభజించినట్లు తెలుస్తోంది. గ్రామీణ బ్యాంకుల్లో కేంద్రం వాటా 50 శాతం, ప్రాయోజిత బ్యాంకుల వాటా 35 శాతం, రాష్ట్ర వాటా 15 శాతం కలిగి ఉన్నాయి. 2024 మార్చి చివరి నాటికి గ్రామీణ బ్యాంకులు 22069 శాఖల ద్వారా సేవలు అందిస్తున్నాయి. 28 రాష్ట్రాల్లో, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో గ్రామీణ బ్యాంకులు పనిచేస్తున్నాయి. ఒక్కో రాష్ట్రానికి ఒకటి ఉంచి మిగిలిన బ్యాంకులను విలీనం చేయనున్నారు.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి