హనుమకొండ పద్మాక్షీ కాలనీలో క్రికెట్ బెట్టింగులు నడుస్తున్నాయనే పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారంతో కాకినాడకు చెందిన క్రికెట్ బుకీ వీరమణికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 2023లో గోవా వెళ్లిన వీరమణికుమార్కు యోగేశ్ గుప్తా అనే బుకీ పరిచయం అయ్యారు. బుకీగా వ్యవహరిస్తే భారీగా సంపాదించవచ్చని చెప్పడంతో వీరమణికుమార్ అంగీకరించారు.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల గురించి యోగేశ్ వివరించాడు. వచ్చిన లాభంలో 9 శాతం కమిషన్ వస్తుందని చెప్పడంతో వీరమణి కుమార్ అంగీకరించాడు. యూప్ లింకు, యాజర్ ఐడి, పాస్ వర్డ్ తీసుకున్నాడు. వాటి ద్వారా క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నాడని వరంగల్ పోలీసులు వెల్లడించారు.
బెట్టింగులకు సంబంధించిన రూ.5 కోట్ల డబ్బు వీరమణి ఖాతాల్లో జమ అయ్యాయని పోలీసులు గుర్తించారు. అందులో యోగేశ్‌కు రూ.3 కోట్లు చెల్లించాడు. బెట్టింగుల్లో గెలిచిన వారికి కోటి ఇచ్చాడు. మరో కోటితో కాకినాడలో ఓ ప్లాట్ కొన్నాడు, మద్యం దుకాణాలు దక్కించుకున్నాడు. బెట్టింగుల కోసం వరంగల్ వెళ్లిన వీరమణి కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి లక్షన్నర నగదు స్వాధీనం చేసుకున్నారు.