సన్ రైజర్స్ హైదరాబాద్ కు వరుసగా నాలుగో ఓటమి
ఐపీఎల్-2025లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను గుజారాత్ టైటాన్స్ ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ మరో 20 బంతులు మిగిలుండగానే 3 వికెట్లు నష్టపోయి 153 పరుగులు చేసింది. దీంతో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓడింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ భారీ స్కోర్ చేయలేకపోయింది. అభిషేక్ శర్మ 16 బంతుల్లో 18 పరుగులు చేసి వెనుదిరగగా ట్రావిస్ హెడ్ 5 బంతుల్లో 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ 14 బంతుల్లో 17 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి మాత్రం 34 బంతుల్లో 31 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా మిగిలాడు. హెన్రీచ్ క్లాసిన్ (27), అంకిత్ వర్మ (18), పాట్ కమిన్స్ (22) పరుగులు చేశారు. కమిందు మెండిస్ (1), సిమర్జిత్ సింగ్ (6), మహమ్మద్ షమి (6) విఫలమయ్యారు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సిరాజ్ నాలుగు వికెట్లు తీయగా, ప్రసిద్ధ్ క్రిష్ణ రెండు , సాయి కిషోర్ రెండు వికెట్లు తీశారు.
లక్ష్య ఛేదనలో గుజరాత్ అద్భుతంగా ఆడింది. అందివచ్చిన ప్రతి బంతి నుంచి పరుగులు రాబట్టింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ 43 బంతుల్లో 61 పరుగులు చేయగా వాషింగ్టన్ సుందర్ 29 బంతుల్లో 49 పరుగులు చేశాడు. రూథర్ ఫర్డ్ 16 బంతుల్లో 35 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జోష్ బట్లర్, సాయి సుదర్శన్ విఫలమయ్యారు.
సన్ రైజర్స్ జట్టులో మహ్మద్ షమీ రెండు వికెట్లు తీయగా, పాట్ కమిన్స్ ఒక వికెట్ తీశాడు.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి