శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒంటిమిట్ట ఆలయం శ్రీరామ నామస్మరణతో మార్మోగుతోంది.ఏప్రిల్ 11న జరుగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం కోసం ఆలయంలో నేడు తలంబ్రాల తయారీ శాస్త్రోక్తంగా జరిగింది.
శ్రీవారి సేవకులతో ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టింది. బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేసి, తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు.
కడప, అన్నమయ్య జిల్లాల నుంచి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో సేవలందించేందుకు 425 మంది శ్రీవారి సేవకులు లక్షకు పైగా తలంబ్రాల ప్యాకెట్ల తయారీలో పాల్గొంటున్నారు.
కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి ప్రశాంతి, పిఆర్ఓ కుమారి నీలిమ, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి