కెనడా పార్లమెంటు భవనాన్ని తాత్కాలికంగా మూసివేశారు. శనివారంనాడు పార్లమెంటు భవనంలోకి దుండుగుడు దూరడాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించి ఆ ప్రాంతంలో లాక్ డౌన్ ప్రకటించారు. ఆదివారం దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు. అతని వద్ద ఆయధాలు ఉన్నాయా లేవా అనే విషయం స్పష్టం కాలేదు. దుండగుడిని విచారిస్తున్నారు. ఆ ప్రాంతంలో జన సంచారాన్ని నిషేధించారు. పార్లమెంటు భవనంవైపు ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నెల 28న కెనడా పార్లమెంటుకు ముందస్తు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 23న ప్రధాని మార్క్ కార్నీ పార్లమెంటును రద్దు చేశారు. అక్టోబరులో జరగాల్సిన ఎన్నికలు దాదాపు ఆరు నెలలు ముందుగానే నిర్వహిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ దుండగుడు పార్లమెంటు భవనంలోకి చొరబడటం ఆందోళన కలిగిస్తోంది. దేశానికి చెందిన సున్నితమైన సమాచారం కాజేయడానికే దుండగుడు ప్రవేశించాడనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి