తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుంటే మరికొన్నిచోట్ల ఎండ దంచికొడుతోంది. అకాల వర్షాలు, పిడుగులతో ప్రజలం భయాందోళనకు గురవుతున్నారు.
దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో మరో ఐదు రోజుల పాటు ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ పేర్కొంది. మరోవైపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని తెలిపింది.
కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి కారణంగా రేపు తెలంగాణలోగంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి