వైసీపీ కీలక నేత మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కేసులు నమోదు కావడంతో ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించిన అహ్మద్ బాషాను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేసి, కడప పోలీసులకు అప్పగించారు.
కడప వినాయకనగర్‌లో ఓ స్థల వివాదంలో అహ్మద్ బాషాపై కేసు నమోదైంది. కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసరెడ్డిని దూషించిన కేసులున్నాయి. పలు కేసులు నమోదు కావడంతో అహ్మద్ బాషా విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అహ్మద్ బాషాను ముంబై నుంచి పోలీసులు కడప తరలిస్తున్నారు. సోమవారం కడప కోర్టులో హాజరు పరిచే అవకాశముంది.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి