వృద్ధి సాధించడంలో ఏపీ సత్తా చాటుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి స్థిర ధరల్లో 8.21 శాతం వృద్ధి రేటుతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలోకి ఎగబాకింది. 9.69 శాతం వృద్ధితో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో పలు రాష్ట్రాల వృద్ధి రేటును సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ సంస్థ దీనిపై తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ఏడాది కాలంలోనే ఏపీ వృద్ధి రేటు 2.02 శాతం పెరిగి 8.21 శాతంగా నమోదైంది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఏపీ వృద్ధి రేటు 12.02 శాతంగా ఉంది.
ఏపీ వృద్ధి రేటు దేశంలోనే రెండో స్థానానికి చేరడంపై సీఎం చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్ అంటూ సీఎం పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాలతో, ప్రజల సహకారంతోనే వృద్ధి సాధ్యమైందన్నారు. ఇది ప్రజల సమష్టి విజయంగా సీఎం అభివర్ణించారు.రాష్ట్ర బంగారం భవిష్యత్తు కోసం అందరూ కలసి నడవాలని పిలుపునిచ్చారు.
నోరు పారేసుకున్న కర్ణాటక కాంగ్రెస్ హోంమంత్రి