మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో చరణ్ జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టైటిల్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ శ్రీరామనవమి సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.