ఎస్వీయూ విద్యార్ధులకు పెనుప్రమాదం తప్పింది. గత కొంత కాలంగా ఎస్వీయూలో రాత్రిపూట చిరుత సంచారంపై విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి చిరుత బోనులో చిక్కింది. చిరుతను ఎస్వీయూ జంతుప్రదర్శనశాలకు తరలించారు.
తిరుమల, తిరుపతిలో చిరుతల సంచారం ఎక్కువైంది. తిరుమల కాలినడకబాటలోనూ చిరుతల సంచారంపై గతంలో పలు మార్లు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల, తిరుపతి ప్రాంతంలో దాదాపు 14 చిరుతలు ఉన్నట్లు సెన్సెస్ ద్వారా తెలుస్తోంది.