తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఆలయ మహాద్వారం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అర్చకుల వేదమంత్రాలు, మేళతాళాలతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంప్రదాయబద్ధంగా ఇష్థికఫాల్ స్వాగతం పలికారు.
స్వామివారి దర్శనం తరువాత భారత ప్రధాన న్యాయమూర్తి కి వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి శేష వస్త్రం కప్పిన అనంతరం రంగనాయకుల మండపంలో ప్రసాదం అందజేశారు. స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
టీటీడీ ఇన్ ఛార్జ్ సీవీఎస్వో శ్రీ హర్షవర్ధన్ రాజు, ఇతర అధికారులు సీజేఐ పర్యటన ఏర్పాట్లన ఏర్పాట్లను పర్యవేక్షించారు.